22, సెప్టెంబర్ 2007, శనివారం

Gurthu

వస్తావే,

గుర్తుకొస్తావే,

ప్రతి చొట నీవే ,ప్రతి పని లొను నీవే ,

నన్ను నిన్నుగా చెసుకొని ,

నా పక్కనే ఉంటూ నన్ను విఢిచి , నువ్వె నేను అయిన నన్ను బాధ పెడతావా?

14, సెప్టెంబర్ 2007, శుక్రవారం

పొయ్యి మీద ప్రొడక్షన్ సర్వర్

మొన్న ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి చేరుకున్నా

ఖాళీగా ఉన్న బ్యాచలర్ ఏమీ చేస్తాడు .....??

సొంతంగా వంట చేసుకుంటాడు ... !! అలాగే నేను కుడా బ్యాచలర్ ధర్మాన్ని పాటిస్తూ వెరైటీగా ఉంటుందని
బంగాళదుంప వేపుడు మొదలెట్టా ..... కూర వండినట్టే చెయ్యాలి అనుకున్నా

నాకేమీ తెలుసు పొయ్యి మీద ప్రొడక్షన్ సర్వర్ పెట్టా నని

ఫ్రై పూర్తి అయ్యే సారికి చుక్కలు కనిపించాయి

10, సెప్టెంబర్ 2007, సోమవారం

జోహార్లు

చావుతో చెలగాటం ఆడేవాడు హైదరాబాదీ అవుతాడు ...
నేను వేళాకోళం ఆడుతున్నాను అనుకున్నారా ......... లేదా విషాదం లో హాస్యలాడుతున్నాడు అనుకుంటున్నారా ......
ఇదే జీవన సత్యం ...
మొన్న ఉగ్రవాదుల దుశ్చర్య అన్నారు .... నేడు ప్రబుత్వ నిర్లక్ష్యం అంటున్నారు
ఏ పేరు పెడితేనేంటి తెగి పడేది అమాయకుల తల లే గాని నేతల వి కావు గా ,,,,,,,,,

మరో విషాదం

మక్కా మస్జీద్ లో రేగిన జ్ఞాపకాలు ఆరాక ముందే , గోకుల్ చాట్ గాయాలు మానక ముందే
''భాగ్యనగరం మీద మరో దెబ్బ పడింది
సారి ఒక టెక్నికల్ ఎరర్ మన పాలిత శాపం అయ్యింది , కట్టక ముందే ఫ్లైయూవర్ కూలింది

5, సెప్టెంబర్ 2007, బుధవారం

తెలుగు బ్లాగు బాగు బాగు

ॐ ఏమీ చేసిన ఓం తో మొదలు పెడితే మంచిదంటారు , నీను అదే చెస్తున్నా .ఇక నుంచి మనస్సు కు నచ్చినట్టు తెలుగు లో రాస్తా