9, సెప్టెంబర్ 2013, సోమవారం

అంతకు ముందు ఆ తరువాత !!

ఈ పొస్టు ప్రస్తుతం ఆడుతున్న సినిమా రివ్యూ కాదు

నా జీవితాన్ని,ఒక రకంగా మలుపు తిప్పిన రోజు ,మే 1,2013

ఎప్పటి నుంచో వెళ్లాలి అని అనుకుంటున్న ఆన్-సైటు వెళ్ళి తిరిగి వచ్చిన సమయం అది.పెద్దగా డబ్బులు ఏమీ మిగుల్చుకోకపొయినా ఎంతో అనందంగా ఉన్నాము .కానీ ఏప్రిల్ మొదటి వారం లో చేతి వేళ్లు ,కీళ్లు తెల్లవారు జామున కొద్దిగా నొప్పిగా అనిపించేవి .అదేమి విచిత్రం ఏమో కాని ,ఆఫీసు కు వెళ్లాక తగ్గిపొయేవి

ఐదు రోజులు సెలవులు వొచ్చాయి ఏప్రిల్ నెల ఆఖరున . ఏడు ,ఏనిమిది సంవత్సరముల తరువాత పూర్తిగా విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకున్నా .అన్ని రోజులు ఇంటి గడప దాటలేదు .కాని అప్పుడు తెలియదు అలా చాలా రోజులు ఖాళీగా వుండాల్సి వొస్తుందని

మే ఒకటిన కొద్దిగ గొంతు గర గరగా అనిపించింతింది .నీళ్లు తాగుదామని ప్రయతినిస్తే మింగుడు పడలేదు , ముక్కు లోనుంచి బయటకి ఒచ్చేసాయి .మధ్యాన్నం  వరకు  కూడా నేను పెద్దగా పట్టికుంచుకోలేదు, కానీ మా ఆవిడ బలవంతాన ఆసుపత్రి కి వెళ్ళాను .చెవికి ,అన్నవాహిక పరీక్షలు చేసిన తరువాత ,బ్రెయిన్ దొబ్బిందేమొ అని అనుమానం వ్యక్తం చేసారు డాక్టరు

పోలిసోడు తాగుబోతుకి పెట్టే పరీక్షలు చేసారు.తిన్నగ నాలుగు అడుగులు వెయ్యమంటే ,మూడో  అడుగు పక్కకు వేసాను .డాక్టరు ఐసియు అన్నాడు ,నేను ఇంటి కెళ్ళి ,మళ్ళీ పొద్దున్న వస్తా అన్నాను,డాక్టరు గట్టిగా అరిచి నీకు నిజంగానే బుర్ర ఢాం !! అన్నాడు   .

  మా ఆఫీసు లో పని చేస్తే ఏ తలనొప్పో, నడుం నొప్పో వస్తుందనుకున్నా కానీ ,ఇలా నీళ్లు కూడా తాగ లేను అనుకోలేదు .సర్లే వాడు కూడా బతకాలి కదా అని జాయిన్ అయ్యాను 

ఒక్క రోజు కూడా వుంచకుండా నీ అల్లరి భరించలేము ,నీ నచ్చిన చోటికి పో అని బయటకి తొసేసారు .అక్కడినుంచి దూరంగా ..చాలా చాలా దూరంగా వెళ్లాము .కొత్త అసుపత్రి (కింస్) వాడు ,ఛస్స్ ఐసియు ఏమి అక్కర్లేదు కానీ మా స్టార్ రూం లో మాత్రం కొన్ని రోజులు ఉండాలి అన్నాడు .సౌకర్యాలు బావున్నాయి కదా అని టెంప్టు అయ్యాను .ఆ మరుసటి రోజు నుంచి చుక్కలు కనిపించాయి .పొడిచిన చోట పొడవకుండా పొడిచి ,చేసిన పరీక్ష చెయ్యకుండా ,నాలుగు రోజులు పరీక్ష చేసి,చిన్న మెదడు దగ్గర చిట్టి నరం లో బుల్లి రక్తం గడ్డ కట్టింది అని తేల్చారు.సరే ఏమి చెయ్యాలి అంటే ,మా దగ్గర అంత చిన్న కత్తి లేదు ,ఎవరి దగ్గర ఉండదు కాబట్టి మీరు అలాగే ఉండండి అని మందులు ,మాకులు ఇచ్చారు 

ఆరు రోజుల తరువాత ,మా బిల్లు మాకు వోచ్చేసింది ,మీరు ఇక దయ చెయ్యండి .కాకపొతే ,మీ పాపం పండేదాకా అంటే ఒక మూడు వారాలు గట్టిగా గొంతుకు వ్యాయమం చేసుకోండని  ఒక బొమ్మ చేతిలో పెట్టారు 

ఆసుపత్రి లో ఉన్నంత సేపు నా బదులు  నా భార్య, కుటుంబ సభ్యులు బాధ పడటం చేతవల్లనో ,నాకు అండదండగ ఉండటం వల్లనో  నేను ఏ మాత్రం అందోళన చెందలేదు .పాపం ఆ పాట్లెవో , వాళ్ళే పడ్డారు .మూడు వారాలతరువాత సుబ్బరంగా ఐస్క్రీం తినేసాను . రెండు నెలల తరువాత మళ్ళీ ఆఫీసు కి మళ్ళీ షురు !! 

నా ఆరోగ్యం బాగు పడాలని కోరుకున్న నా హితులకి ,స్నేహితులకి ఎప్పటికి రుణపడి ఉంటాను !!

ఇంత సేపు నా సోది చదివిన  వాళ్ళు ఎవరన్న ఉంటే, రోజు కాండి క్రష్ ఆడేవాడిగా చిన్న తాయిలం .అంతకు ముందు ఆ తరువాత సినిమా గురించి చిన్న ఝలక్ .ఫస్ట్ హాఫ్ ఎంత బండల్ ఉందంటే,నా నెత్తి మీద సుత్తి పెట్టి నాకే కొట్టుకోవాలనుకునేంత.కానీ సెకండ్ హాఫ్ మాత్రం తల తిప్పనివ్వకుండ చేసింది.ఇంద్రగంటి సగం సినిమా మాత్రమే తీసాడేమో  !!