24, జనవరి 2008, గురువారం

బఠాని

బఠాని ....................

కాకపొతే కొంచెం మెత్తటి బఠాని ...............
అడుక్కునే వాడివే అన్ని గడపలు..........
గ్రామ సింహం గర్జించునా ?
వేచి చూడండి.........

ఆటో సూక్తులు

"పూజ కి పువ్వు......

నాకు నువ్వు......

ఇదే మన లవ్వు....."


ఇది ఈ రోజు నేను ఆటో లో ఆఫిసు కు వస్తుండగా పక్క ఆటో లో కనిపించింది ...సింపుల్ గా చెప్పినా భలే చెప్పారు ఎవరో...


ఇప్పటి వరకు నేను

పేపర్లో యాడ్ చూశా...

టీ.వీ లొ చూశా...

బిల్ల్ బోర్ద్ మీద చూశా...

నెట్ లొ చూశా...

యూనిపొల్ మీద చూశా... .
(బాగ్క్రౌండ్ లొ చూశా... చూశా...
అనే పాట వినండి ...)

ఇదెక్కడి గొడవండి బాబు రోడ్డు మీద అడ్డంగా ఇద్దరు మనుషులు
వినైల్ పొస్టరు పట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నరు

ఇలా ఐతే ఎలా చచ్చేది

ఆటో లొ వచ్చెటప్పుడు అమ్మాయలని చుస్తే భయం ....

వెనక సీట్లో ఉన్నవాన్ని డ్రైవర్ ముందుకు రమ్మాంటాడు ....

ఈ రోజు భలే జరిగింది ..

నేను ఆటో లొ వెనక కుర్చుంటే ఒక అమ్మాయి ని చుసి డ్రైవర్ ఆపాడు ... ఆమె ఆటో లొనికి ఒరకంట చూసి దీంట్లో నేను రావాలా అన్న చూపు చూసింది ....

వెనకాల నా పెదవుల పై ఒక సన్నని నవ్వు .....

22, జనవరి 2008, మంగళవారం

కలగాపులగం

మరి పని పాట ఎమి లేక పోవడం తో ఈ సారి వెరైటీ గా ఉంటుందని పులిహొర తయారు చెయాడం మొదలెట్టా...
చెయ్యడం ఎలాగో తెలీదు కబట్టి ఎం.టి.అర్ పులిహొర పొడి కొని యుద్దానికి సన్నద్దం అయ్యా .........
8 వంతులు అన్నం కి ఒక వంతు పొడి కలపమన్నాడు బియ్యం ఐతె కొలవచ్చు కాని అన్నం ఎలా కొలవాలో చెప్పలెదు...
అసలె మనం ఆర్తి అగర్వాల్ టైపు
ఎదొ సినేమలొ అమె
హిరొ ఒక నిమషం ఫ్రై చెయ్యమంటే వాచీ ఇచ్చి వెళ్ల మంటుందె
అదె రకం నేను కుడా
ఎదొ విదం గా చెస్తూ ,పులిహొర విజయవడ కనకదుర్గమ్మ ప్రసాదం లాగ వస్తుందని కలలు కంటు వుంటె .... నా ముందు నల్ల మబ్బులు కనిపించాయి .. ఇంకెముంది చుస్తే బంగారు రంగు పులిహూర కాస్తా ...బ్లాచ్ టామరిండ్ రైసు ఐపొయింది
ఎవరికి తప్పినా మా తమ్ముడుకి తప్పదు కద ... .వాడే మొత్తం తిన్నాడు ... వాడే నా రక్షానందనికి బలి కా బక్రా
సొదర(సొదరి) కూలిలు అందరు వేచి చుస్తున్నట్తె నెను కూడ ,"బఠాని " లు ఇస్తారూ లేక బిస్కెట్లు ఇస్తారో చుస్తున్నా .......
ఒక సహ కూలి కి బఠాని అంది నట్టు అభిజ్గ్న వర్గాల భొగొట్టా
ఇంక ఎన్ని రొజులు ఇలా బ్లాగుతాను నాలొ సగం కొసం ఇంక ఎన్నాళ్లు ఈ నిరీక్షణ ????

1, జనవరి 2008, మంగళవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు...

అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
కొత్త సంవత్సరం కొత్తగ ఏమైనా చేద్దమని సినిమా సమీక్ష రాస్తున్నా ... సమీక్ష అనే కంటే నా అభిప్రాయం అంటె సరిగ్గా ఉంటుంది .... ఈ మధ్య నేను చుసినా సినేమాలు
మంత్ర ,అనసూయ .... ఈ రెండు థ్రిల్లెర్ సినేమాలు ...
మంత్ర లొ సస్పెన్స్ కూడ ఉంటుంది.....
మంత్ర ఒక పురాతన భవనం.... దానికి సంభందించిన రహస్యం గురించి....ఆ ఇంట్లొ దెయ్యం ఉందా లేక మరెదైనా ఉందా అనేది ..సినేమ అంత ఒక ఉత్కంటత ఉంటుంది ...చార్మి బావుంది
ఇంక అనసూయ కూడ బావుంది
ఈ సినేమ ఒక క్రైం థ్రిల్లెర్ ... ఇందులొ భూమిక హంతకుడిని ఎలా గుర్తించి ,అతని నుంచి తను పెంచుకునె పాపని ఎల కాపడుకుంటుదనెది కధ ...ఇందులొ మంత్ర చుస్తున్నప్పుడు కలిగిన భయం కలగలెదు కాని కధనం లొ ఒక గ్రిప్ ఉంచాడు రవిబాబు
ఈ రెండు సినేమాలు కి ఒకటే తేడా మంత్ర చుసినప్పుడు జనాలు మట్లాడకుండా (నా పక్కన్న కుర్చొని బయపడుతున్న పాప తప్పిస్తె ) చూసారు అనసూయ లొ ఐతె జనాలు తమ చుట్టు జరుగుతున్నట్తు ఫీల్ అయ్యి కామెంట్స్ చేసారు