30, మార్చి 2008, ఆదివారం

కంత్రి .... ఒక మాజీ బండోడు

ఈ టపా శీర్షిక చుస్తే Jr.NTR అంటే నాకు పెద్ద మంచి అభిప్రాయం లేదని తెలుస్తుంది కాని ... అది పూర్వ స్వరూపం లో ఉన్నప్పుడు (అతని రూపం లో తప్పు ఏమి లేదు కాని హీరో కి ఉండాల్సిన లక్షణాలు లేవనే కోపం ..నాకు అతని మీద కోపం ఉండటం ఏంటి అతని ముందు నేనెంత ... కాకాపోతే హీరో కి అర్హుడు కదాని ఒక బలమైన అభిప్రాయం ..) కాని యమదొంగ లో బాగానే ఉన్నాడు ఒక పాట కూడా పాడాడు కొంచమే మోటు గానే ఉంది కాని పర్లేదు .. ఇంతకూ ముందు ఉన్న అభిప్రాయం లేదు (కొంచెం మెత్త బడ్డా .. ) కంత్రి పోస్టరు చూసి ఆశ్చర్య పోయా .... ఈ కుర్రాడి లో చాలా కసి ఉంది అనిపించింది .... మళ్లీ దీనిలో కుడా ఒక పాట పాడాడు ..కొంచెం రాప్ లా ఉంది పాట .... వాయిద్యాల హోరో లేక అతని మంచి గా పాఢాడో గాని చాలా బాగుంది కాకపోతే మొదటే సరే వింటే అదోలా ఉంది రెండో సరి నుంచి చాలా బాగుంది .. ఏమో ఇంకో ఒకటి రెండు సినిమాల తరువాత అతని సినిమాలు కుడా హాలు లో చుస్తానేమో ..

అఘోర .. ఒక కొత్త దురద

మొన్నే ఈ మధ్య మా చిన్న నాటి స్నేహితుడి ని కలిసా ...... వాడు కాబోయే తరానికి రాబోయే దర్శకుడు ....

వాడితో ఒక మాట అన్నా ఆ తరువాత నుంచి ఉన్నాయి చూడండి నా పాట్లు ... (నేను నీకు ఒక కధ ఇస్తా దాన్ని సినిమా తియ్యి అని ... ) కధ రాయటం అంటే మాటలా ? దానికి బుర్ర ఉండాలి ... చిన్నప్పుడు ఉండేది ,ఇప్పుడు మా కంపెనీ వాళ్ళు ఎత్తుకుపోయారు దాన్ని ...ఎంతైనా చిన్న అప్పటినుంచి నాకు కధ రాయాలని ఒక దురద ఉండేది ....అది అసంకల్పిత చర్య గా నేను అలా మాటల్డానేమో ....

సరే కధ అనుకున్నాం కదా ఒక రోజు ఆఫీసు కి బయలు దేరు తుంటే మొత్తం కధ అంత ఒక ఫ్లాష్ లాగా కనిపించింది (బస్తి మే సవాల్ , ea రచయతకైన అంత లేదో మో ... మనది రచన ఐతే కదా ... ;) )

కధ అఘోర నేపద్యం లో ఉంటుంది (ఈ అఘోర అనే వాళ్ళు కాశీ లో ఉండి... అక్కడ గంగా లో తేలియాడే శవాలని తింటారని ౧౯౯౫ (1995) ఇండియా టుడే లో , అది రైలులో పక్క వాడు కొంటే నేను తెసుకొని చదివా .... అది నేను స్కూల్ లో ఉన్నప్పుడు లెండి ) ...

మన హీరో ఒక నిరు పేద కుటుంబం నుండి వచ్చి హౌస్ సర్జన్ చేస్తూ ఉంటాడు ... అతనికి వాళ్ల Deanఅంటే చాలా గౌరవం ....

ఎందుకంటే హీరో వాళ్ల స్నేహితుడు ఒకడు ఒక ప్రమాదం లో తీవ్రం గా గాయపడి చావా లేక బతక లేక ఉన్నాపరిస్థితి లో వీపరీతమైన బాధ అనుభవిస్తూ ఎవరన్న తనని తొందరగా చంపెయమని అనుకుంటూ హీరో కళ్ళ ముందే చని పోతాడు .. సో మన హీరో కొంచెం మెరసి కిల్లింగ్ కి సానుకులం గా ఉంటాడు (సశేషం )

11, మార్చి 2008, మంగళవారం

ఎందుకీ ఈ రచ్చ?


8౦ ఏళ్ళ తరువాత భారత హాకీ జట్టు ఒలెంపిక్స్ కి అర్హత పొంద లేదంట
పత్రికలూ ప్రజలు గోల చేస్తున్నారు

అహ మన వాళ్ళు వెళ్లుంటే ఎ ఎడో , ఎనిమిదో స్థానం దక్కించుకునే వాళ్ళు .... అంతకు మించి ఏమి వచ్చి వుండేది కాదు
ఎప్పుడో నేను పుట్టకముందు బంగారు పతాకం గేల్చుకున్నారు ......
అంతకు ముందు ఒ ఎనిమిది సార్లు గెలిచారు అంట
ఏదో చాక్ దే సినిమా చూసి వీళ్ళు గోల చేస్తూఉన్నారు

ఐన మహానుభావుడు , పంజాబ్ లో తీవ్రవాదం అనిచేసిన 'గిల్లు' గారికి ఈ గోల ఒక లెక్క ?

కో.మే :సదరు గిల్లు గారు అమ్మయలిని గిల్లి డం లో తల పండిన వారు ... ఒక లేడి I.A.S ని గిల్లిన చరిత్ర హీనులు

4, మార్చి 2008, మంగళవారం

ఆస్ట్రేలియా ముచ్చట తీర్చిన భారత్

మూడో ఫైనల్ జరగకుండా ఉంటే బావుంటుంది అని వారు కోరుకుంటే ,మన వాళ్లు , వాళ్ళ సరదా కాదంటే , బావుంటుందా

వరుసగా రెండో ఆట కూడా గెలిచి చూపించారు
దెబ్బ కు ఠా దొంగల ముఠా !!!