ఈ మధ్య నాకు తెల్లగా అవ్వాలని ఒక కోరిక పుట్టింది ... అంతే సూపర్ మార్కెట్ కి వెళ్లి ఒక ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ తెచ్చుకొని వాడడం మొదలు పెట్టా .. మొదటి రోజు బానే ఉంది ... రెండో రోజు పర్లేదు ..... మూడో రోజు లేచి చూసుకునే సరికి ఇంకేముంది .... నేను అమ్మాయి గా మారి పోయా !! , ఇదెక్కడి గొడవ రా భగవంతుడా అని నేను ఏడుస్తుంటే ,వెనక నుంచి షారుక్ ఖాన్ వచ్చి (అవును షారుక్ ఖానే ) , అమ్మాయిల క్రీమ్ వాడితే అంతే మరి , నాలా ,తెల్లగా అవ్వాలంటే మగ వాళ్ళు వాడే " ఫెయిర్ అండ్ హ్యాండ్ సం " వాడు అని చెప్పాడు , ఆ క్రీమ్ కొనగానే నన్ను మళ్లీ అబ్బాయి గా మార్చేసాడు .
మళ్లీ మొదలు , ఈ సారి మొదటి రోజు చాలా బావుంది , రెండో రోజు ఏదో పర్లేదు అనిపించింది , వారం రోజుల తరువాత చూసుకుంటే , ఆశ్చర్యం , అత్భుతం , నా మొహం , నా మొహం లానే ఉంది , షారుక్ ఖాన్ లా మారలా !!