ఏదో సెలవలు వచ్చాయికదా అని రూమ్ లోనే కూర్చుంటే తెలిసింది , టైం పాస్ చెయ్యటం ఎంత కష్టమైన పనో !!
అదే ఆపీసు లో ఐతే ఇట్టే గడిచి పోయే సమయం ,ఇంట్లో ఖాళీగా కూర్చుంటే అస్సలు గడవదు . ఆంధ్రుల అభిమాన కాలక్షేపం సినిమా , సినిమా , సినిమా ............... కాబట్టి నేను
మూడు రోజులలో మూడు సినిమాలకి వెళ్ళా , అదే నాలుగు చూసుంటే నాలుగు సార్లు "సినిమా " అని
రాయాల్సి వచ్చేది .
నేను చూసిన మొదటి సినిమా 'రక్ష' (అంటే ఇంతకుసినిమా చూడలేదు అని కాదు ... ) .ఈ సినిమా
దర్శకుడు వంశి ఒక మంచి పని చేసాడు ,జనాల్ని కేవలం భయ పెట్టె ప్రయత్నం చెయ్యలేదు , మనిషి తన
అనుకున్న వాళ్ళకోసం ఎలాంటి వాటి నన్నా నమ్ముతాడు , చిన్న ఉదాహరణ ఏంటంటే మనకు ఆప్తులు ఎవరికన్నా
ఒంట్లో బాలేక , ఎన్ని ఆసుపత్రులకు వెళ్ళిన బాగవక పొతే , ఏ దేవుణ్ణి మొక్క మన్నా మొక్కుతాం ,ఎమన్నా
చేస్తాం .... అదే చూపించాడు దీంట్లో , అదే విషయం నాకు నచ్చింది ..
ఇక రెండో సినిమా గోపీచంద్ నటించిన 'శౌర్యం ' . రివ్యూ ల లో ఈ సినిమా గురించి బాగానే రాసారు ..వాటి
మీద నమ్మకం పెట్టుకొని వెళ్ళా , కాని దీంట్లో విషయం ఏమి లేదు ...ఒక పాట , రెండు ఫైట్లు అంటే
....దీని గురించి రాయలన్టనే బద్ధకం గా ఉంది
ఇక ముఖ్య మైనది ... పుర ప్రజల ఆరోగ్యం దృష్టి లో పెట్టుకొని ,అతి బలవంతం మీద ఈ టపా రాయటానికి
కారణం ఐన ఈ సినిమా పేరు 'ద్రోణ' .. దీన్ని సోనాలి బెంద్రే భర్తా గోల్డీ బెహల్ తీసాడు . ఈ సినిమా టైటిల్
లో కార్టూన్ నెట్వర్క్ , పోగో ఛానల్ పేర్లు పడ్డప్పుడే నా మనసు ఎందుకో కీడు శంకించింది. మరి చందమామ కధ
ని సినిమా కింద తీసే పారేశారు . అది కూడా ఏదో పిల్లలాట లాగ , ఒక్క చోట వాళ్ళు తీసిన సినిమా కనపడలా
కోట్లు మాత్రమే వృధాగా కనిపించాయి
3, అక్టోబర్ 2008, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)