ఏమి రాయాలో తెలియట్లేదు ....
ఈ మధ్య నా బుర్ర పని చెయ్యట్లేదు ...
పని లేనప్పుడు పని లేదని గొడవ ... పని ఉంటే పని ఉందని బాధ ....
చేసి పని ఆసక్తికరంగా లేక పోతే ఇలాగే ఉంటుదేమో ... నా పాత సహఉద్యోగి వెళ్తూ .. వెళ్తూ ...(అదృష్టవంతుడు)
చేసే పని ఎలాంటిది అయినా సరిగ్గా చెయ్యాలి ,లేక పోతే మానెయ్యాలి అని ఒక ఉచిత సలహా ఇచ్చాడు.....
అతని చెప్పిన విషయం నా మట్టి బుర్ర కి ఎప్పుడు అర్ధం అవుతుందో...
కిందటి వారాంతం లో రెండు సినిమాలు చూసా మొదటిది మిస్టర్ .మేధావి ,రెండోది విశాఖ ekspress
అదేంటో నాకు రెండు బాగానే అనిపించాయి ... మొదటిది నెమ్మదిగా నడిచింది కాకపోతే పాత సినిమా లాగానే ఉంది ఒకటే తేడా పాత సినిమా లో తరువాతి సన్నివేషం మనం ఊహిస్తామ, కాని ఆ సినిమాలు పాత్రధారులే తరువాతి సన్నివేశం ఇలా ఉంటుంది అని చెప్పి మరి చూపించారు , ఆ సంగతి కొంచెం కొత్తగా అనిపించింది ,
ఇక విశాఖ ఐతే ఇదే సినిమా ఇంగ్లిష్ లోనే చాలా సార్లూ తీసారు , హిందీ లో కుడా తీసారు , మనకి కొంచెం కొత్తగా ఉంటుంది , కాకపోతే కుటుంబం తో వెళ్లి చూడ లేము కొన్ని సన్నివేశాలు ..ఒంటరి గా ఐతే నవ్వుకుంటాము కాని కుటుంబం ముందు నవ్వలేము .. ఈ సినిమా చుసిన తరువాత ఒకరు మాత్రం బాగా బాధ పడే ఉంటారు ఆమే రాజీవ్ బార్య సుమ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి