30, మార్చి 2008, ఆదివారం

అఘోర .. ఒక కొత్త దురద

మొన్నే ఈ మధ్య మా చిన్న నాటి స్నేహితుడి ని కలిసా ...... వాడు కాబోయే తరానికి రాబోయే దర్శకుడు ....

వాడితో ఒక మాట అన్నా ఆ తరువాత నుంచి ఉన్నాయి చూడండి నా పాట్లు ... (నేను నీకు ఒక కధ ఇస్తా దాన్ని సినిమా తియ్యి అని ... ) కధ రాయటం అంటే మాటలా ? దానికి బుర్ర ఉండాలి ... చిన్నప్పుడు ఉండేది ,ఇప్పుడు మా కంపెనీ వాళ్ళు ఎత్తుకుపోయారు దాన్ని ...ఎంతైనా చిన్న అప్పటినుంచి నాకు కధ రాయాలని ఒక దురద ఉండేది ....అది అసంకల్పిత చర్య గా నేను అలా మాటల్డానేమో ....

సరే కధ అనుకున్నాం కదా ఒక రోజు ఆఫీసు కి బయలు దేరు తుంటే మొత్తం కధ అంత ఒక ఫ్లాష్ లాగా కనిపించింది (బస్తి మే సవాల్ , ea రచయతకైన అంత లేదో మో ... మనది రచన ఐతే కదా ... ;) )

కధ అఘోర నేపద్యం లో ఉంటుంది (ఈ అఘోర అనే వాళ్ళు కాశీ లో ఉండి... అక్కడ గంగా లో తేలియాడే శవాలని తింటారని ౧౯౯౫ (1995) ఇండియా టుడే లో , అది రైలులో పక్క వాడు కొంటే నేను తెసుకొని చదివా .... అది నేను స్కూల్ లో ఉన్నప్పుడు లెండి ) ...

మన హీరో ఒక నిరు పేద కుటుంబం నుండి వచ్చి హౌస్ సర్జన్ చేస్తూ ఉంటాడు ... అతనికి వాళ్ల Deanఅంటే చాలా గౌరవం ....

ఎందుకంటే హీరో వాళ్ల స్నేహితుడు ఒకడు ఒక ప్రమాదం లో తీవ్రం గా గాయపడి చావా లేక బతక లేక ఉన్నాపరిస్థితి లో వీపరీతమైన బాధ అనుభవిస్తూ ఎవరన్న తనని తొందరగా చంపెయమని అనుకుంటూ హీరో కళ్ళ ముందే చని పోతాడు .. సో మన హీరో కొంచెం మెరసి కిల్లింగ్ కి సానుకులం గా ఉంటాడు (సశేషం )

3 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

కొత్తతరం బల్లి శా్స్త్రం బాగుంది. మిగతా టపాలు కూడా బాగా రాస్తున్నారు.

కొత్త పాళీ చెప్పారు...

అన్నట్టు మీ బ్లాగు కూడలిలోనూ జల్లెడలోనూ ఉన్నట్టు లేదు. చేర్చండి.
http://koodali.com
http://jalleda.com

sweeyapraneetham చెప్పారు...

oghora oka kotta durada concept thone "nenu devunni" ane tamil dubbing movie vachchesindi kada ippudu happyna mi thoughts tera midakochchesinanduku? all the best kotta kadha alochinchadni (kompadisi nene devunni kadha rachayta mirena? telika edo vaga sorry rasa kshaminchandi)