నిన్న ఆఫీసు నుంచే వచ్చేసే సమయం లో యాహూ లో ఒక వార్త చూసా , ఈ మధ్య కాలం లో ఇండియా లో ఉన్నా తల్లితండ్రులని ఎంతో బాధ పెట్టె సంఘటన .
అది ఒక హైదరాబాద్ అమ్మాయి అమెరికా లో హత్య కు గురైన ఘటన , అన్నిటి కన్నా బాధ కలించిన ఏంటంటే , ఆa అమ్మాయి మా జే.ఎన్.టే.యు రిజిస్త్రార్ గారి అమ్మ్మాయి కావటం , ఆమె పేరు చూసి ఎఁక్కడో విన్న పేరు లా ఉంది కాని వెంటనే ఏమి గుర్తుకు రాలా.
నేను ఎం.టెక్ ప్రాజెక్ట్ చెయ్యటానికి ఎన్.టి.ఐ.ఎల్ అనే కంపెనీ కి వెళ్ళే వాడిని , అక్కడ కి అప్పుడప్పుడు ఆమె వచ్చేది , ఆమె ఇంక బీ .టెక్ పూర్తి చెయ్యకుండానే మాకు అప్పుడప్పుడు ప్రాజెక్ట్ లో సలహాలు ఇచ్చేది .ఎంతో చలాకీగా , ఎప్పుడు నవ్వుతు ఉండేది .
ఆమె ఐతే కాకూడదు అని అనుకున్నా , కాని పొద్దున్న పేపర్ చుస్తే ఆ అమ్మాయి ఫోటో నే ఉంది , ఒక్క నిమషం మాటలలో వ్యక్తం చెయ్యలేని బాధ ,కోపం .. కలిగాయి
5, నవంబర్ 2008, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)