సాధారణంగా విపరీతమైన తల నొప్పి కలిగినప్పుడు ,నేను బ్లాగు రాస్తూ ఉంటాను.ఈ సారి కొంచెం తేడా !!
కొన్ని నెలల నుంచి లాగ్స్ చూసి చూసి నా తల బద్దలు అవుతోంది ,ఐనా తప్పుదు కదా , తప్పనిసరి తెచిపెట్టుకున్న పని, పొట్ట నింపే పని,కాదని అనలేం , భార్య తో పాటు ,కొత్తగా పని ని కూడా భరించాల్సి వస్తోంది
మోడి గారి దెబ్బకి ఆచి తూచి ఖర్చు పెడ్తున్న నేను ,ఈ రోజు తెగించేసి సినిమా కి వెళ్లాను .
చూస్తే కధేమి ఉన్నట్టు అనిపించదు ,కట్టె కొట్టె తెచ్చే టైపు లో ఐతే 'కొట్టె ' కూడా లేదు.కానీ, చూస్తున్న అంత సేపు పాత్రలు మాత్రమే కనిపిస్తాయి .
కావలసిన తెలివితేటలు ,ధైర్యం ఉన్నా ,స్తైర్యం లేనప్పుదు, హీరో ని అందరు ఎలా వాడుకుంటారో , అమ్మాయి ప్రేమ కోసం హీరో ఎలా తన లోపం ని సరిచేసుకుంటాడో. ఆ తరువాత ,తనను వాడుకున్న వాళ్ల వల్లే ,హీరోయిణ్ చేత ప్రేమించబడతాడో అదే కధ !!
పై పై న చూస్తే ఏ పాత సినిమా కధ లానో ,చందమామ కధ లానో అనిపిస్తుంది కాని, సినిమా అద్యంతం వినోదమే .మనలో ఒక్కణ్ని తెర పైన చూస్తాం అంతే , ఎక్కడా అసభ్యత కి ,వివాదానికి తావు లేని కధ . ఒక సామాన్యుని కధ . జయమ్ము నిశ్చయమ్మురా!!
సినిమా చూసి వొచ్చిన తరువాతా , ఈ మధ్య మళ్లీ చూసిన అటువంటి సినిమా జ్యో అచ్యుతానందా మాత్రమే గుర్తుకు వచ్చింది
రెండు కధలకి పోలిక లేకున్నా ,సునిశిత హాస్యం ,మన ముందు కదలాడే పాత్రలు ,రెంటిలో కామన్ .
రెండిటిలో నాతో పాటు చదువుకున్న వాళ్లు పని చెయ్యటం ఇంకోటి కామన్ .
జ్యో అచ్యుతానంద లో ఉన్నట్టే ,నేను కుడా 'చివరికి మిగిలేది ' పుస్తకం ఇంకా పూర్తిగా చదవలేదు