27, ఏప్రిల్ 2008, ఆదివారం

తెలిసే చేసారా ?

ఈ రోజు పొద్దున్నే లేచి నాగార్జున సర్కిల్ ( అదే నండి పడిపోయిన పంజాగుట్ట ఫ్ల్యోవేర్ దగ్గర ) ఒక ఇంటర్వ్యూ ఉంటే వెళ్ళాను , ఏమైంది దొరికిందా జాబు అని మాత్రం అడగొద్దు .....నాకు సిగ్గేస్తోంది ....ఆల్రెడీ ఒక చోట పని చేస్తున్న కాబట్టి సరి పోయినిది..... లేక పోతే ...సాపాటు ఎటు లేదు ..పాట పాడుకునే వాణ్ని ...... తిరిగీ వస్తుంటే ఒక దృశ్యం చూస్తుంటే నా కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది (మళ్లీ ఫ్ల్యోవేర్ పద లేదు లెండి ) కాని అక్కడ ఒక నాయకుని విగ్రహం దగ్గర తే.రా.సా తోరాణాలు కట్టి ఉన్నై ..... (నేను తెలంగాణా వాదిని కాను .....తే.da.పా వాళ్లు "మేము తెలంగాణ కి వ్యతిరేకం kaadu" టైపు డవిలాగు ఇది kudaaను ...)

తీరా చూద్దును కదా ఆ విగ్రహం చేతిలో చిన్న లాటి కర్ర ఉంది ... అంటే అర్ధం అయ్యి ఉంటది ....అది మర్రి చెన్న రెడ్డి ది ....అదేనండి ౧౯౬౯ టైం లో పని పాట లేనప్పుడు టి.ఫై.స అని ఒక పార్టీ పెట్టి జై తెలంగాణ అని ,చాలా మందిని చంపి ... (దానికి ఉద్యమం అని పేరు పెట్టి ....) గెలిచిన వెంటనే తెలంగాణ ని చాప చుట్టి నట్టు చుట్టి ఇందిరమ్మ కు ఇచ్చినా ఆ kuhaanaa తెలంగాణ వాడి కి మళ్లీ ఈ కొత్త తెలంగాణ వాదులు కదటారా ??.... అసలు వీళ్ళు తెలిసే ఈ పని చేసారా ...లేక తెలంగాణా వాళ్ల చావులు మర్చిపోయారా !!! (తెలంగానుకు వ్యతిరేకిస్తున్న నాకే ఇంతాగా మండుతుంటే మరి జై తెలంగాణ అన్నా వాళ్ళకి ఇంక ఎంత కోపం రావాలి ... !! )

బుతుఉలు వస్తున్నై కాని తిట్టలేక పోతున్న ...అందరు క్షమించాలి

ఆ ప్రత్యేక తెలంగాణా వస్తె తొందరగా బావుణ్ణు మా విజయవాడ లో కుడా హైతెక్కు సిటీ లు వస్తాయి .....మా ఇళ్ళ అద్దెలు పెరుగు తాయి .....

(అందుకు మాత్రమే జై తెలంగాణా ....)

సరి ఐన సమయం లో సరి ఐన నిర్.... దానికి మీరే సా..

ఇక లాభం లేదు , ఈ అన్యాయం కి అంతు ఉందా .....


ఈ రోజు జ్యోతి లో "జ్యోతి" గారి "బ్లాగుడుకాయలు " తో కలిపి జ్యోతి లో రెండు సార్లు .... ఈనాడు లో ఒక సారి తెలుగుa బ్లాగరుల గురించి వ్యాసాలూ వచ్చాయి .....ఐన కాని నా గురించి ఒక్కట్టంటే ఒక్క్క చోట కూడా కనీసం ఒక్క అక్సరం ముక్క కుడా రాయలేదు ..... ఇక చేసిదేమి లేదు


నేను కూడా అ పత్రిక్ పెట్టుకుంటున్నా ... దానికి మీరే సా...... (ఎందుకు లెండి )


ఇది ప్రజా ప్రయోజనార్ధం జారి చేయ బడిన ప్రకటన

26, ఏప్రిల్ 2008, శనివారం

ఒ భగ్న హృదయం ....... ఒ బీరు క్యాను


ఆగండి ...... ఆగండి ....... ఈ టపా లో ఏదో నేను నా డెందము ఎలా వ్రక్కలు అయ్యిందో చెప్తా అనుకుంటే మీరు కందిపప్పు లో కాలు వేసి నట్టే ...(డెందం గిన్డెం అంటున్నాడు బాగా ఎక్కి దనుకుంటున్నారు అదిగో ఈ సారి మీరు ఏకం గా సాంబార్ లో పడ్డట్టే ...)
ఏమి జరిగిందంటే మా మిత్రుడు ఒకడు బాగా బోరు కొడుతుందంటే నా బ్లాగ్ లింకు ఇచ్చా (సెల్ఫ్ ప్రమోషన్ అన్న మాట ) వాడు నా బ్లాగు చదవకుండా (మిత్ర ద్రోహి ....) జల్లెడ మొత్తం మొత్తం జల్లించి అమ్మాయి పేరు మీదు ఉన్నా బ్లాగ్స్ అన్ని చదవటం మొదలు పెట్టాడు (అమ్మాయి పేరు ఉన్నా బ్లాగు లన్ని ఆడ వారే రాస్తారు అనుకునే అంత అమయాకుడు వాడు ) ..మొత్తానికి ఒక అమ్మాయి పేరు ఉన్నా బ్లాగు చూసి ఆ బ్లాగు కి అభిమాని అయ్యిపోయాడు ... ఎంతగా అంటే వాళ్ళఆఫీసు లో ఉన్నా అన్ని sistems కి వెళ్లి వోట్ వేసేంతగా .......ఆ అమ్మాయి kuuda బ్లాగు చాలా బాగా రాసేది అనుకోండి అది వేరే సంగతి .......
తొండ ముదురి ఊసరివిల్ల్లి వీడు ఇక డ్రీమ్ సాంగ్స్ వేసుకోవడం మొదలెట్టాడు ...... కాని ఆమే ఎలా ఉంటాడో అసలు అడదో ....పెద్ద ఆవిడో ఏమి తెలియని పరిస్థితి ... ఒక తొమ్మిది నెలల వేదన తరువాత ఒక ఐడియా తట్టింది ... ఇక అన్ని కంమునితీస్ లో ఆమే పేరు మీద ఉన్నా ప్రో ఫైల్స్ వెతక సాగాడు ... ఒకానొక అదృష్ట ( దురదృష్ట ) సమయాన నాకు ఫోన్ చేసి "మామా !! ఒక సారి రా అన్నాడు ... "తీరా చుస్తే కళ్ళ నీళ్లు కక్కుకుంటూ ఆమే ఆర్కుట్ ప్రొఫైల్ చూపాడు ..ఆ పిల్ల కి రెండు రోజులు ముందే పెళ్లి అయినిది " అది సంగతి
అది చుసి నవ్వుకుంటున్న (వాడు ఏడుస్తున్నాడు కదా ... ) వాడి రూం లో ఒక బక్క వెదవ ఉన్నాడు ..తీరా చుస్తే పది కేజీ ల కాండ ఉండదు కాని చేతిలో బీరు క్యాను ... వాడి దుంప తెగిపోను అప్పుడే బీరు అవసరమా అనిపించింది....
(అంటే నేనేదో పెద్ద పట్టిత్ట్hu కాdu ... నా కున్న చెడ్డ అలవాట్లు నాకున్నై ....(ఆల్ లేడీస్ అత్తెన్షన్ ప్లీజ్ "చెడు అలవాట్లు అంటే స్మోకింగ్ , ద్రింకింగ్ కాదని " నా manavi )

23, ఏప్రిల్ 2008, బుధవారం

హిట్టు కొట్టు .... గిఫ్టు పట్టు

నా ప్రియాతి ప్రియమైన బ్లాగ్ చదువరులు అందరికి నా ధన్యవాదాలు
నా మొదటి ౧౦౦ హిట్స్ రావాటానికి ౬ నెలలు పడితే ౨౦౦ హిట్స్ రావటాఁనికి కేవలం ౨ వారాలు మాత్రమే పట్టింది .....

ఈ ఒక్క ఉదాహరణ చాలు నా బ్లాగు విజయం వైపు పయనిస్తుందని నొక్కి ఒక్కానిస్తున్నాను ... ఆ విధం గా మనం ముందుకు పోదాం ,,,
(దీని కి మా తమ్ముడి మీద పడ్డ బల్లి .. తొందర్లో రాబోతున్న కంత్రి కారణం అని గమనించ గలరు ..)

ఇలా నా బ్లాగు ముందుకు పొతూ వుంటే ....(నా అక్క చేల్లెల్లకు అన్నా తమ్ముల్లకు రుణం తీర్చుకోవాలనిపించి .....)
నేనొక కొత్త పధకం ప్రవేశ పెడుతున్నా ....
ఈ రోజు నుంచి వారం లో
నా బ్లాగు ని ౧౦ సార్లు చూసిన వారికి లేటెస్ట్ సినిమా టికెట్లు ....
నా బ్లాగు కేక అని కామెంట్లు ఇచ్చిన వారికి ఒక వాచీ .....
నీ బ్లాగు చూసి జన్మ సార్ధకం అన్నా వారికి రవీంద్ర భారతి లో బంగారు పువ్వుల సన్మానం జరపబడుతుంది
ఇంకెందుకు ఆలస్యం ..... హిట్టు కొట్టండి ... గిఫ్టు పట్టండి .....
ఆలసించిన ఆశా భంగం .....మించి పోతుంది మంచి తరుణం ..........
ఒక ముఖ్య గమనిక : బహుమతి పంపెదుకు మీరు మీ క్రెడిట్ కార్డు నంబరు తెలిపిన చొ తొందరగా పంపేదము ..... మరుయు ఉచితముగా ఒక తడి గుడ్డ , గుండు కు గంధం పంపబడును
పంప వలిసిన చిరునామా _దోస@అప్పడం.com

4, ఏప్రిల్ 2008, శుక్రవారం

సర్వధారి నామ నూతన సంవత్సర ముందస్తు శుభాకాంక్షలు

సర్వధారి నామ నూతన సంవత్సర ముందస్తు శుభాకాంక్షలు

1, ఏప్రిల్ 2008, మంగళవారం

మనిషి శకునం (బల్లి మాటల్లో )

పోదున్నే లేగాగానే మా తమ్ముడి మీద బల్లి పడింది (౬ ఇంటికి లేగిస్తే ఇలాగే అవుతుఁన్దంటారా .. మారాలి ఐతే )

బల్లి శకునం పుస్తకం తిప్పుతుంటే .. ...... అక్కడ బల్లి బాష కూడా కనిపిస్తోంది

సీన్ కట్ చేస్తే .. మా తమ్ముడి మీద పడ్డ బల్లి కుడా కంగారు కంగారు గా తమ బల్లి పెద్ద దగ్గరికి వెళ్లి "పోదున్నే మనిషి మీద పడ్డ నాకేమవుతోంది అని అంటోంది (పొద్దునే బల్లి బాష చదివా కాబట్టీ వాటి మాటలు అర్ధం అవుతున్నై ... )

బల్లి :ఇప్పుడు ఏమవుతుంది నాకు చాలా భయం గా ఉంది

బ.పే: నువ్వు ఎవరు మీద పడ్డావ్ .. ... .

పుస్తకం లోకి చూస్తూ ....

వాడు

వై.ఎస్ ఐతే నువ్వు "రాజీవ్ బల్లి ఐపోతావ్ ....నీ మీద ఆ రెండు పత్రికలలో మంచి కవేరేజి వస్తుంది ...""

హీరోయినే ఐతే " సినిమా సైట్ ల నిండా నీ ఫోటోలు పడతాయి "

"చిరు ఐతే నీకు వ్యతిరేకం వంద సైట్లో నిన్ను సమర్దిస్తూ మరో వందో సైట్ లో నీ గురించి చర్చించుకుంటారు "

బ.పే: ఇంతకీ నువ్వు పడింది ఎవరి మీద ?

బల్లి: అతనూ ఈ ఎవరు కాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ !! ఇప్పుడు నా పరిస్తితి ఏంటండి అంది బయపడుతూ ..

బ.పే: ముసి ముసి నవ్వులు navutuu... ఐతే ఈ పాటికి నువ్వే ఏ తెలుగు బ్లాగ్ లో అచ్చు ఐపోతావ్ అంది !!