26, ఏప్రిల్ 2008, శనివారం

ఒ భగ్న హృదయం ....... ఒ బీరు క్యాను


ఆగండి ...... ఆగండి ....... ఈ టపా లో ఏదో నేను నా డెందము ఎలా వ్రక్కలు అయ్యిందో చెప్తా అనుకుంటే మీరు కందిపప్పు లో కాలు వేసి నట్టే ...(డెందం గిన్డెం అంటున్నాడు బాగా ఎక్కి దనుకుంటున్నారు అదిగో ఈ సారి మీరు ఏకం గా సాంబార్ లో పడ్డట్టే ...)
ఏమి జరిగిందంటే మా మిత్రుడు ఒకడు బాగా బోరు కొడుతుందంటే నా బ్లాగ్ లింకు ఇచ్చా (సెల్ఫ్ ప్రమోషన్ అన్న మాట ) వాడు నా బ్లాగు చదవకుండా (మిత్ర ద్రోహి ....) జల్లెడ మొత్తం మొత్తం జల్లించి అమ్మాయి పేరు మీదు ఉన్నా బ్లాగ్స్ అన్ని చదవటం మొదలు పెట్టాడు (అమ్మాయి పేరు ఉన్నా బ్లాగు లన్ని ఆడ వారే రాస్తారు అనుకునే అంత అమయాకుడు వాడు ) ..మొత్తానికి ఒక అమ్మాయి పేరు ఉన్నా బ్లాగు చూసి ఆ బ్లాగు కి అభిమాని అయ్యిపోయాడు ... ఎంతగా అంటే వాళ్ళఆఫీసు లో ఉన్నా అన్ని sistems కి వెళ్లి వోట్ వేసేంతగా .......ఆ అమ్మాయి kuuda బ్లాగు చాలా బాగా రాసేది అనుకోండి అది వేరే సంగతి .......
తొండ ముదురి ఊసరివిల్ల్లి వీడు ఇక డ్రీమ్ సాంగ్స్ వేసుకోవడం మొదలెట్టాడు ...... కాని ఆమే ఎలా ఉంటాడో అసలు అడదో ....పెద్ద ఆవిడో ఏమి తెలియని పరిస్థితి ... ఒక తొమ్మిది నెలల వేదన తరువాత ఒక ఐడియా తట్టింది ... ఇక అన్ని కంమునితీస్ లో ఆమే పేరు మీద ఉన్నా ప్రో ఫైల్స్ వెతక సాగాడు ... ఒకానొక అదృష్ట ( దురదృష్ట ) సమయాన నాకు ఫోన్ చేసి "మామా !! ఒక సారి రా అన్నాడు ... "తీరా చుస్తే కళ్ళ నీళ్లు కక్కుకుంటూ ఆమే ఆర్కుట్ ప్రొఫైల్ చూపాడు ..ఆ పిల్ల కి రెండు రోజులు ముందే పెళ్లి అయినిది " అది సంగతి
అది చుసి నవ్వుకుంటున్న (వాడు ఏడుస్తున్నాడు కదా ... ) వాడి రూం లో ఒక బక్క వెదవ ఉన్నాడు ..తీరా చుస్తే పది కేజీ ల కాండ ఉండదు కాని చేతిలో బీరు క్యాను ... వాడి దుంప తెగిపోను అప్పుడే బీరు అవసరమా అనిపించింది....
(అంటే నేనేదో పెద్ద పట్టిత్ట్hu కాdu ... నా కున్న చెడ్డ అలవాట్లు నాకున్నై ....(ఆల్ లేడీస్ అత్తెన్షన్ ప్లీజ్ "చెడు అలవాట్లు అంటే స్మోకింగ్ , ద్రింకింగ్ కాదని " నా manavi )

4 కామెంట్‌లు:

రాధిక చెప్పారు...

సరదాగా రాసారా?లేక నిజమేనా?నిజమయితే సో సేడ్.అయినా అభిమానం బ్లాగు వరకు వుంటే సరిపోతుందండి.మరీ ఎక్కువ దూరం వెళ్ళిపోతే బోర్లాపడాల్సొస్తుంది.

BHARAT చెప్పారు...

@రాధిక గారు
కొంత నిజం .. కొంత అబద్దం

వాడు ఆ అమ్మాయి ఏలా ఉంటుందో అని మాత్రమే అనుకున్నాడు .. ఓర్కుత్ లొ ఫొటొ చూసాడు ...మిగతది నా పైత్యం

అజ్ఞాత చెప్పారు...

Hi bharat,
Your post is really good..

BHARAT చెప్పారు...

అరుణ గారు తాంకు లు (Thanks) అండి