26, మే 2008, సోమవారం

చేసుకున్నవారికి చేసుకున్నంత !!


చేసుకున్నవారికి చేసుకున్నంత అని ఎందుకు అంటారో నిన్నే నాకు అనుభపూర్వకం గా తెలిసింది .
ఎందరో మంచి మనసు గల మారాజులు , తుఫాను ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేసినా కూడా , నేను కంత్రి సినిమా కి వెళ్ళడం విధి వైపరీత్యం కాక పోతే మరేంటి !!
మొదటి సారి వెండి తెర ఫై ఎన్.టి.ఆర్ చూసే సాహసం చేస్తే ఇలాగే అవుతుందేమో !!

సైజు తగ్గించుకున్న కారణం గా చూద్దామని వెళ్ళా ( యమదొంగ లో కూడా తగ్గాడు కాని అప్పటికి ఇంక అతని సినిమా చూసే ధైర్యం రాలా !! ) .
సినిమా ముందు అందరు తప్పని సరిగా చూడాల్సింది ఆర్.ఎస్ బ్రదర్స్ యాడ్ కాబట్టి ,దాని తోనే శ్రీకారం జరిగింది , ఆ తరువాత న్యూస్ రీల్ ,అనగా కాంగ్రెస్ కి ఓటు వెయ్యండి అనే ప్రచార కార్యక్రమం అన్న మాట ...
ఎంత కాంగ్రెస్ అంటే కొంచెం అభిమానం ఉన్నా కూడా ఆ రీల్ ని భరించ లేక పోతుంటే , నా కంటే మంచి కోపం గా ఉన్న
అమ్మాయి ఒకామె ,"వీడి (వై.ఎస్ ) గోల బరించ లేకపోతున్న , తీసెయన్ద్రా బాబు !! అని గోల పెట్టడం మొదలెట్టింది " . టికెట్టు కొన్న అందుకు ఈ రోజు టైం పాస్ అవుతుందని నాకు ఆనందం కలిగింది .
సినిమా మొదలయ్యింది , "సైకిల్ డైలాగులు , హెడ్డు డైలాగులు , రెండు ఫైట్లు ,రెండు ముద్దులు" ఐన తరువాత సినిమా బాగానే ఉంది కదా , పాపం అందరు ఎందుకు ఆడి పోసు కుంటూ న్నారు అని నాకు అనిపించింది , ఇంతలో ఇంటర్వెల్ వచ్చేసింది . ఇంటర్వెల్ దగ్గర నాకు ఒక్క సారి పోకిరి ఇంటర్వెల్ గుర్తుకు వచ్చింది , ఆ మాత్రం పోలికే రావటం సహజమే కదా అనిపించింది (ఎందుకంటే అందరు పోకిరి రీమేక్ అని అన్న అభిప్రాయం విన్న తరువాత చూసాను కదా ) .

ఇక అసలు కధ ఆరంభం (సినిమా కాదు అవి నా బాధలు ) , ఇంటర్వెల్ తరువాత ౪౫ నిమషాలు కధ ఎటు కదలట్ల , నేను రెండు కళ్లు మూసుకొని సినిమా వింటున్నా !!
ఇంతలో రెండో హీరోయిను "హి ఈజ్ ఇంతేరేస్తింగ్ అంది , క్రాంతి ని . "
ఇక నా వెనుక కూర్చున్న అమ్మాయి "హి ఈజ్ ఇంతేరేస్తింగ్ ,అటే !! " అని ఒకటే నవ్వులు "
అప్పుడు నాకు మెలుకువ వచ్చింది .
సినిమా హాలు నుంచి బయటకు వెళ్ళటానికి ఒపిక లేక మిగతా సినిమా ని భరించ వలిసి వచ్చింది

23, మే 2008, శుక్రవారం

తాజా వార్త !! (వార్త అనగా పుకారు )


ఇది ఎంత వరకు నిజమో తెలియదు కాని , పుకారు సారాంశం ఏంటంటే
ఈ టి వి కి ఇక ప్రభాకర్ లేడు !!
http://www.greatandhra.com/ganews/viewnews.php?id=7610&cat=&scat=

తెలుగు బ్లాగురలం ఒక మంచి కధాంశం మిస్ అవుతాం !!
నాకు ఏడుపొస్తోంది :'(

22, మే 2008, గురువారం

ఉట్టి మీద తట్ట - రోట్లో తల



మూడు రోజుల నుండి నా పరిస్తితి ఇలా ఉంది .నేను ఉన్న కొలువు కి జై కొట్టి కొత్తబంగారు లోకం వైపు చుస్తూ పట్ట పగలే కలలు కంటున్నాను .... పంచదార చిలక లాంటి తీపి కబురు కోసం చూస్తూ ఉంటే , చావు కబురు చల్లగా మెయిల్ లో వచ్చింది .... సదరు కొత్త లోకం కంపనీ వాళ్ల నుండి .
"బాబు మీ చూపులు ఆకాశం వైపు ఉన్నై , కాని మీ కాళ్ళు ఇంక నేల మీదే ఉన్నాయి " , " ఇందు మూలం గా చెప్పోచేదేమంటే మీరు కోరిన ది ఇస్తే మా కంపని పుట్టి మునుగును కావున ఇచ్చిందే ,పుచ్చుకోండి "
అని చావు కబురు చల్లగా చెప్పారు కొత్త బ....(ఇంకేమి బంగారం , నా బొంద , పాత రాగి సామానులు కొంటాం ,అనే వాళ్లు ఇప్పుడు :'( )

ఇక ఇటు చుస్తే మా కంపనీ వాళ్ళేమో , అదుగో హైకు , ఇదిగో పని అని , చిన్న పిల్లాడి కి చంద మామ ని చూపుతున్నట్టు మాకు చూపిస్తున్నారు .వచ్చే నెలలో లోనే వచ్చేస్తోంది హైకు అనుకుంటే , మేము ఏమి ఇత్తడి కొంపని కి తక్కువా అని , " ఒమేరికా వాడు నాటిన డాలర్లు సరిగ్గా పండి చావలేదు , కావున మీకు వచ్చే నెల కాదు , ఆ పై నెల లో ఇస్తాము " అని ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చారు .
బెంచి మీద కూర్చున్న ఆసాములకి శంకర గిరి మాన్యాలు కి పంపుతామని బెదరిస్తున్నారు !!

ఇప్పుడు జీడి పప్పులు (క్రీమ్ బిస్కట్ ) ల బదులు సేన్క్కాయలు (కుక్క బిస్కట్ ) లు ఇస్తామన్న వొడి దగ్గరా కేళ్లాల , లేక ఉట్టి మీద ఉన్న ఖాళి తట్ట చూపుతున్న చోటే ఉండాలా , తేల్చుకోలేక తల బద్దలు కొట్టుకుంటున్న !!

ఈ ప్రశ్న కి మీకు సమాధానం తెలిసి చెప్పక పోతే మీ తల వెయ్యి వ్రక్కలు అవుతుంది ( బాగా ఒల్డుగా ఉంది , పోని మూడు నెలలు బెంచి మీద , నెట్టు , కుర్ర్చోడానికి కుర్చీ లేకుండా ఐపోగలరు )

16, మే 2008, శుక్రవారం

దశావతారం కధ

అది , శైవులకి ,వైష్ణవులకి తీవ్ర వేభేదాలు ఉన్న కాలం , తమిళనాడు లో శైవులు ప్రబలం గా ఉన్న ప్రాంతం .అక్కడ విశ్నుదాసు గా కమల హసన్ పుడతాడు , అతను పెరిగి పరమ వైష్ణవునిగా మార తాడు , వైష్ణవులని అనిచే వేసే ధోరణి చూసి ,శైవ ద్వేషి గా మారతాడు ,
ఆ విషయం ఆ రాజ్యపు రాజు కి తెలిసి అతనికి కటిన శిక్ష విధిస్తాడు ,
అతన్ని విష్ణు విగ్ర హం కి కట్టేసి సముద్రం లో పడేస్తారు , కాని అతని అద్రుష్టం వల్ల బయట పడి, ఆ శైవ నగరం ని నాశనం చేస్తే గాని వైష్ణవులు బతక లేరని నిర్ణయించుకుంటాడు ,

దాని కోసం ఒక మహా యంత్రం తయారుచేస్తుండగా , ఆ రాజు కుమార్తె ఐన జయప్రద ని మొహిస్తాడు ,

కాని ఆమే రాజకుమారి అని తెలిసిన తరువాత ఆమే ని మర్చి పోతాడు ,

ఆ తరువాత ఆ యంత్రం ని నగరం లో అమర్చి వస్తుండగా ,
ఇంకో కమలహాసన్ సాధు రూపం లో వచ్చి ," శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అని " జ్ఞాన బోధ చేస్తాడు .

అది తెలిసి శివరాత్రి నాడు నాశనం అయ్యలె చేసిన యంత్రం ని నాశనం చేసిందుకు బయలుదేరుతాడు ,కాని ఆ రాజు ఒకటో కమలహాసన్ తన కూతురి జోలికి వచ్చ్చాడని తెలిసి అతన్ని చంప మని అదేసిస్తాడు , కమల్ ఆ యంత్రం ని నాశనం చేస్తుండగా అతని మీదకి దాడి చేసి చంపుతారు , కాకపోతే కమల్ చనిపోయే ముందు ఆ యంత్రం లో మార్పులు చేసి చనిపోతాడు .

కట్ చేస్తే అమెరికా లో జార్జి బుష్ చెవిలో ఒక తెల్లోడు ఏదో గోనుగుతాడు .... విషయం ఏమంటే ఇండియన్ ఒసన్ లో ఏదో శక్తీ కేంద్రం aktivaTe అయ్యిందని ,అది సముద్రం లో అమెరికా అణు బాంబుల దాచిన దగ్గర ఉందని , ప్రపంచం ప్రమాదం లో పడిందని (ప్రపంచం అంటే ఒమేరికా అని అర్ధం చేసుకో గలరు ) .

దీన్ని లోతుగా సోదించగల యోధుడు ఎవర్రాని అని గూగుల్ లో వెతికితే నాసా లో పని చేసి ఇంకో కమల్ హసన్ అని తెలుస్తుంది . అతని పిలుచుకొని చుస్తే కదా, కమల్ హసన్ అచ్చు జార్జి బుష్ లా ఉన్నాడు ....

ఇంతకూ కమల్ నీటి లోకి దిగి ప్రపంచాన్ని ఎలా రక్షించాడు .... మధ్య మధ్య లో ఐటెం గర్ల్ మల్లికా ఎలా కమల్ కి ఆటంకం కలించిందనేది వెండి తెరపై చూడండి


కో.మే : ఈ కధ నా సొంతం ,దీనికి గనుక కమల్ సినిమా తో సంబందం ఉంటే నేనే కే.ఎస్.రవి కుమార్ ... మేరె నా ఒస్చార్ రవిచంద్రన్ .....

చిన్నపుడు బొమ్మలు చూపించి కధలు రాయండి అనే వాటిని చూసి చూసి స్పూర్తి తో !!

15, మే 2008, గురువారం

టెర్రరిజం లో లేటెస్ట్ ట్రెండ్ !!


జైపూర్ లో జరిగిన బాంబు పేలుళ్ల లో ౬౦ మంది చని పోయారని మీ అందరికి తెలిసిన విషయమే . ఈ రోజు టైమ్స్ ఆప్ ఇండియా లో ని కధనం ప్రకారం టేర్ర్రిస్తులు లేటెస్ట్ ట్రెండ్ ఫాల్లో అవుతున్నట్లు కనిపిస్తోంది ... ఇప్పటి వరకు అల్-కాయిడ ,హమాస్ వంటి తీవ్రవాద సంస్థలు వంటి కరడు గట్టిన తీవ్రవాద సంస్తలు మాత్రమె , దాడులని , ఆత్మా హుతి దళాలను వీడియో తీసి పంపు తున్నారు ... ఉదా: వాల్ల్స్త్రీట్ జర్నల్ ముంబాయి ప్రతినిది ఐన దనిఎల్ పెరల్ హత్య మొదలగునవి ,దాన్నే అన్జాలీన జోఒలీ సినిమా కూడా తీసింది , అప్పుడు పపరజ్జి మూలం గా పెద్ద గొడవ కుడ ఐంది ,అది వేరే సంగతీ లెండి

ఇప్పుడు జైపూర్ ఘటన లో కూడా ఎలా ,ఎక్కడ బాంబులు పెట్టారో వీడియో తీసి మరి మీడియా కి పంపారు ,చూసారా ఎంత అభివ్రుదో !! ఇది "మీరు వెర్రి వెంగాలాయిఒలూయి అని వెక్కిరింతో , లేక దర్యాప్తు పక్క పట్టించుకోవటానికి వేసినా పాచికా ?"
ఇక మన పోలిసు యంత్రాంగం ఈ ఆధారాలతో వార్ని పట్టుకొని , కోసి కారం పెడతారో , లేక గోళ్ళు గిల్లుకుంటారో .....
ఒక వేళ పట్టుకున్నా మన రాజకీయనాయకులు "అఫ్జాల్ గురు " వంటి మేధావులు కోసం ఉరి నుంచి క్షామ బిక్ష కొస మ ప్రయత్నించే ప్రమాదం ఉంది !! ( సో ఇంస్తాన్స్ జస్టీస్ ఈజ్ నీడేడ్)


జై భారత్

14, మే 2008, బుధవారం

సిటిజెన్ రిపోర్టు


సి ఎన్ ఎన్ -ఐ బి ఎన్ సిటిజెన్ రిపోర్టు స్పూర్తి తో ఈ టపా రాస్తున్నా

మొన్న ఆఫీసుపని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా .. హైదరాబాద్ లోని యౌసుఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర ఒక జాన పద గీతం వినిపిస్తోంది . దూరం నుంచి వింటే అది సినేమా పాట లాగ కాని .... పెళ్లి బ్యాండ్ లాగాని అని పించ లేదు
ర్యాలీ వెళ్తోంది ..దగ్గర కెళ్ళి చుస్తే ఒక రాజకీయ పార్టీ పాట అది ...దాని ముందు చూస్తే ఆ పార్టీ ఒక్క ప్రచార రధం ఉంది .. ఆ రధం పై పార్టీ ఆభ్యర్ది , ప్రచార సారధి ఉన్నారు .....
కదులు తున్న రధం నుంచి ప్రచార సారధి వచ్చి ఒక అరటి పళ్ల బండి వద్దకు వచ్చి ఒక ఐదు నిముషాలు ఉన్నాడు ... నాకు అక్కడ ఏమి జరుగుతుందో అన్నా ఆసక్తి కలిగి ఆ రధం ని అనుసరించాను ...
సదరు ప్ర.సా రధం ఎక్కి "ఇక్కడ నేను సులేమాన్ భాయి (అరటి పళ్ల అతను ) తో మాట్లాడాను, సులేమాన్ భాయి కి ౩౫ వయసు , రోజుకు ౮౦-౧౦౦ రూపాయల సంపాదన , కాని ఇద్దరు పిల్లలని ౨౦౦ ఫీజు తో ఇంగ్లీష్ మీడియం లో చదివిస్తున్నాడు , ఈ ప్రబుత్వం ౨ రూపాయలకు బియ్యం ఇస్తాం అంటున్నారు , ఉచిత కరెంటు ఇస్తాం , .౨౫ అప్పు ఇస్తాం అని అంటున్నారు కాని , కాని మంచి ఆసుపత్రులు కాని , మంచి చదువు కాని ఇవ్వరు " అని ఉపన్యాసం ఇస్తున్నాడు .... ఆ తరువాత మధ్యలో ఎటువంటి సంబదం లేకుండా ఆయెషా మీరా కేసు , లండను లో చని పోయిన విజయవాడ అమ్మాయి కేసు తెసుకోచ్చారు ..

చమక్కు ఏంటంటే , ప్ర.సా , వారసత్వమ పేరు చెప్పుకొని వస్తున్నా ఈ నాటి రాజకీయా నాయకులు కోట్లు దోచుకుంటున్నారు ..... నిస్సిగు గా అందిన కాడి కి నొక్కుతున్నారు అని అంటుండగా ,శ్రీనివాస్ (అభ్యర్ధి ) నవ్వుతు జనానికి నమస్కారం చెయ్యటం మొదలెట్టాడు ( నాకు ఎక్కడో సింబాలిసం లాగ అని పించింది )

ప్ర.సా మా శ్రీనివాసు " కోట్లు దండుకోవడం కోసం కాదు వచ్చింది . ఈ సులేమాను బిడ్డల బాగు కోసం "అని .

కాకపోతే ఒకటి మాత్రం నిజం ,
ప్ర.స చెప్పిన విషయం ......
" తప్పు చెయ్యటం తప్పు ..... కాని ఆ తప్పు ని చూస్తూ ఉండడం ఇంకా పెద్ద తప్పు .."

"౧౦౦ కో సారా ప్యాకెట్ కోసమో వోట్ వేయ్యోద్దు.... "

వారి ప్రత్యర్ధులు ఇలా అన్నరంట ...." వోటుకు మూడు ఒండలు ఇస్తాం మేము ..... మాకే ఆ వోట్లు పడతాయి ..... ఆలోచించే (మధ్య తరగతి .. .అంతో ఇంతో చదువుకున్నవారు ) వోట్ వెయ్యరు ... ఇక ధనిక వర్గం (చెప్పకర్లేదు అనుకుంటా ) .."

సో మనం ఎప్పటికి ఆలోచిస్తూనే వుంటామ లేక ? మన హక్కు వినియోగించు కుంటామ ?అనేది మనం అలోచిన్చాలిస్నా విషయం , ఏమంటారు ?

8, మే 2008, గురువారం

మీరైతే ఏమి చేసే వారు ?



ఇది నిజం గా జరిగిన సంఘటన

అది నేను ఉద్యోగం లో జేరిన కొత్తల్లో జరిగింది ...

మా ఆఫీసు హి టెక్కు సిటి లో ఉంది ... నేను ఆర్. టి .సి క్రాస్ రోడ్స్ దగ్గర ఉండే వాణ్ని అంటే సుమారు ౧౫ /౨౦ కిలోమీటర్ల దూరం లో ఉన్నా ...
మేము ఉద్యోగం లో చేరిన మొదటి వారం లో ఫోటో ఐ.డిలేని ఎ.టి.ఎం కార్డు ఇచ్చారు ..... మొదటి సారి జీతం వచ్చిన తరువాత చాలా ఆనందం వేసింది .... చదువుకునే టప్పుడు బస్సు లో ఒకడు పర్సు కొట్టేసాడని ఇక జీవితం లో పర్సు ఉన్చోకోకూడదు అని నిర్ణయించుకున్న ..... ఆ నిర్ణయమే ఈ సంఘటన కు కారణం .....

ఒక సుదినాన .... మా బ్యాంకు వాళ్లు ఫోటో ఉన్న కార్డు ఇచ్చి నెల రోజులలో పాత కార్డు పని చెయ్యదు అని చెప్పారు .... మనకు తెలివి ఎక్కువ కాబట్టీ .. పాతది పనిచేస్తోందో లేదని చూస్తే రెండు కార్డులు పని చేస్తున్నై ....

ఇదేదో బాగుందనుకొని ఇంటిలో (విజయవాడ ) లో ఒకటి నాకొకటి అనుకున్నా .....
వారాంతం లో పాత కార్డు ఉంచేసి కొత్తది నాతో ఉన్చుకుంటా అనుకున్నా ...

కాని మన సుడి తెలుసుగా .........

సోమవారం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి చూసుకుంటే జేబులో ( నో పర్సు ...)
౨౦ రూపాయలు మాత్రమె ఉన్నై ...
ఎ.టి.ఎం లో డబ్బులు తీసుకుందాం అని చుస్తే ఇంకేముంది పాత కార్డు వెక్కిరించింది .....(ఎకౌంటు లో చాలా డబ్బులు ఉన్నా జేబులో మాత్రం ౨౦ ) ....మన అద్రుష్టం ఈ రేంజ్ లో ఉందంటే రూం లో ఇంక ఎవరు లేరు ...

అంత కష్టం లో కుడా ఫోన్ లో పైసలు మాత్రం బానే ఉన్నాయి ..

ఇంటికి ఫోన్ చేసి ి," ఇప్పుడు రాత్రి ఎమన్నా తింటే రేపు పొద్దున్న ఆఫీసు కి వేళ్ళ లేను ...నడిచే దూరం కుడ కాదు " ,ఇది పరిస్తితి అని చెబితే , " తిడతారు అనుకుంటే అవతల ఒకటే నవ్వులు , !! "
ఆ తరువాత వాళ్ళే జాలి పడి ఎవరన్న ఫ్రెండ్ ని డబ్బులు అడుగు అని సలహా ఇచ్చారు

ఐతే మా వాళ్లు అందరు కుకట్పల్లి లో ఉన్నారు !!! అంత రాత్రి వాళ్ళని ఏమి ఇబ్బంది పెడతాం అనుకున్నా
ఆ రోజుకు తిన లేదు ... మరుసటి రోజు ఆఫీసు లో స్నేహితుడి నుంచి డబ్బులు తెసుకున్నా


అది కథ

సుప్ప్పోసే ఫర్ సుప్పోసే మీరు ఇలాంటి పరిస్తితి లో ఉంటే ఏమి చేసే వారు ?