8, మే 2008, గురువారం

మీరైతే ఏమి చేసే వారు ?



ఇది నిజం గా జరిగిన సంఘటన

అది నేను ఉద్యోగం లో జేరిన కొత్తల్లో జరిగింది ...

మా ఆఫీసు హి టెక్కు సిటి లో ఉంది ... నేను ఆర్. టి .సి క్రాస్ రోడ్స్ దగ్గర ఉండే వాణ్ని అంటే సుమారు ౧౫ /౨౦ కిలోమీటర్ల దూరం లో ఉన్నా ...
మేము ఉద్యోగం లో చేరిన మొదటి వారం లో ఫోటో ఐ.డిలేని ఎ.టి.ఎం కార్డు ఇచ్చారు ..... మొదటి సారి జీతం వచ్చిన తరువాత చాలా ఆనందం వేసింది .... చదువుకునే టప్పుడు బస్సు లో ఒకడు పర్సు కొట్టేసాడని ఇక జీవితం లో పర్సు ఉన్చోకోకూడదు అని నిర్ణయించుకున్న ..... ఆ నిర్ణయమే ఈ సంఘటన కు కారణం .....

ఒక సుదినాన .... మా బ్యాంకు వాళ్లు ఫోటో ఉన్న కార్డు ఇచ్చి నెల రోజులలో పాత కార్డు పని చెయ్యదు అని చెప్పారు .... మనకు తెలివి ఎక్కువ కాబట్టీ .. పాతది పనిచేస్తోందో లేదని చూస్తే రెండు కార్డులు పని చేస్తున్నై ....

ఇదేదో బాగుందనుకొని ఇంటిలో (విజయవాడ ) లో ఒకటి నాకొకటి అనుకున్నా .....
వారాంతం లో పాత కార్డు ఉంచేసి కొత్తది నాతో ఉన్చుకుంటా అనుకున్నా ...

కాని మన సుడి తెలుసుగా .........

సోమవారం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి చూసుకుంటే జేబులో ( నో పర్సు ...)
౨౦ రూపాయలు మాత్రమె ఉన్నై ...
ఎ.టి.ఎం లో డబ్బులు తీసుకుందాం అని చుస్తే ఇంకేముంది పాత కార్డు వెక్కిరించింది .....(ఎకౌంటు లో చాలా డబ్బులు ఉన్నా జేబులో మాత్రం ౨౦ ) ....మన అద్రుష్టం ఈ రేంజ్ లో ఉందంటే రూం లో ఇంక ఎవరు లేరు ...

అంత కష్టం లో కుడా ఫోన్ లో పైసలు మాత్రం బానే ఉన్నాయి ..

ఇంటికి ఫోన్ చేసి ి," ఇప్పుడు రాత్రి ఎమన్నా తింటే రేపు పొద్దున్న ఆఫీసు కి వేళ్ళ లేను ...నడిచే దూరం కుడ కాదు " ,ఇది పరిస్తితి అని చెబితే , " తిడతారు అనుకుంటే అవతల ఒకటే నవ్వులు , !! "
ఆ తరువాత వాళ్ళే జాలి పడి ఎవరన్న ఫ్రెండ్ ని డబ్బులు అడుగు అని సలహా ఇచ్చారు

ఐతే మా వాళ్లు అందరు కుకట్పల్లి లో ఉన్నారు !!! అంత రాత్రి వాళ్ళని ఏమి ఇబ్బంది పెడతాం అనుకున్నా
ఆ రోజుకు తిన లేదు ... మరుసటి రోజు ఆఫీసు లో స్నేహితుడి నుంచి డబ్బులు తెసుకున్నా


అది కథ

సుప్ప్పోసే ఫర్ సుప్పోసే మీరు ఇలాంటి పరిస్తితి లో ఉంటే ఏమి చేసే వారు ?

7 కామెంట్‌లు:

Eswar చెప్పారు...

Option 1:
i'll go the restaurent that i'll go regularly and convince them .
Option 2:
If my friends are far away and no help then i'll go to my house owner(if they also staying there) and convince them for money.
Option 3:
If it's icici card and there ia a bank near by and time is before 7 pm then i'll go to bank and withdraw money by self.
Option 4:
I'll call my frinds and enquire abt their present location..if they are near by then ask them to come...

and so onnnnnnnnnnnnn...

Eswar Kumar I

BHARAT చెప్పారు...

@eswar @ARADA

I was not able to think that many options at that time :) of all only option 1 was possible for me
but didn't

now onwards i ll use only linux (the OS ur using ) so that my brain may become sharp

Eswar చెప్పారు...

Nice blog...carry on....

అజ్ఞాత చెప్పారు...

Nice Post !
Use an Indian social bookmarking widget like PrachaarThis to let your users easily bookmark your blog posts.

Sujata M చెప్పారు...

నాకు క్లోజ్ ఫ్రెండ్ కనుక ఆ డబ్బులతో బస్ లో రీచ్ అయ్యే దూరం లో ఉంటే, తన దగ్గరకు వెళ్లి డబ్బులు తీసుకునే దాన్ని. అలాంటి చాన్స్ లేక పొతే, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా.. మీరే ఇబ్బంది పడ్డారు చూడండి. నేనూ అలానే చేసేదాన్ని. కానీ మన బుద్ధి కోతి బుద్ధి కదా.. అందుకే పాత కార్డ్ పని చేస్తుందేమో అని ఒక ప్రయత్నం కూడా చేసేదాన్ని. పని చేస్తే ఫైన్. లేక పొతే లేదు.

రాధిక చెప్పారు...

ఆ రోజుకి మంచిగా తినేసి మర్నాడు పొద్దన్నే ఫ్రెండ్స్ కి ఫోనుచేసి పరిస్థితి వివరించి ఇంటికొచ్చి డబ్బులు ఇవ్వమని చెప్పుండేదానిని :)

BHARAT చెప్పారు...

@సుజాత గారు

ఆ పని అయ్యింది :)


@ రాధిక గారు

మీ ఇడియా బావుంది