14, మే 2008, బుధవారం

సిటిజెన్ రిపోర్టు


సి ఎన్ ఎన్ -ఐ బి ఎన్ సిటిజెన్ రిపోర్టు స్పూర్తి తో ఈ టపా రాస్తున్నా

మొన్న ఆఫీసుపని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా .. హైదరాబాద్ లోని యౌసుఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర ఒక జాన పద గీతం వినిపిస్తోంది . దూరం నుంచి వింటే అది సినేమా పాట లాగ కాని .... పెళ్లి బ్యాండ్ లాగాని అని పించ లేదు
ర్యాలీ వెళ్తోంది ..దగ్గర కెళ్ళి చుస్తే ఒక రాజకీయ పార్టీ పాట అది ...దాని ముందు చూస్తే ఆ పార్టీ ఒక్క ప్రచార రధం ఉంది .. ఆ రధం పై పార్టీ ఆభ్యర్ది , ప్రచార సారధి ఉన్నారు .....
కదులు తున్న రధం నుంచి ప్రచార సారధి వచ్చి ఒక అరటి పళ్ల బండి వద్దకు వచ్చి ఒక ఐదు నిముషాలు ఉన్నాడు ... నాకు అక్కడ ఏమి జరుగుతుందో అన్నా ఆసక్తి కలిగి ఆ రధం ని అనుసరించాను ...
సదరు ప్ర.సా రధం ఎక్కి "ఇక్కడ నేను సులేమాన్ భాయి (అరటి పళ్ల అతను ) తో మాట్లాడాను, సులేమాన్ భాయి కి ౩౫ వయసు , రోజుకు ౮౦-౧౦౦ రూపాయల సంపాదన , కాని ఇద్దరు పిల్లలని ౨౦౦ ఫీజు తో ఇంగ్లీష్ మీడియం లో చదివిస్తున్నాడు , ఈ ప్రబుత్వం ౨ రూపాయలకు బియ్యం ఇస్తాం అంటున్నారు , ఉచిత కరెంటు ఇస్తాం , .౨౫ అప్పు ఇస్తాం అని అంటున్నారు కాని , కాని మంచి ఆసుపత్రులు కాని , మంచి చదువు కాని ఇవ్వరు " అని ఉపన్యాసం ఇస్తున్నాడు .... ఆ తరువాత మధ్యలో ఎటువంటి సంబదం లేకుండా ఆయెషా మీరా కేసు , లండను లో చని పోయిన విజయవాడ అమ్మాయి కేసు తెసుకోచ్చారు ..

చమక్కు ఏంటంటే , ప్ర.సా , వారసత్వమ పేరు చెప్పుకొని వస్తున్నా ఈ నాటి రాజకీయా నాయకులు కోట్లు దోచుకుంటున్నారు ..... నిస్సిగు గా అందిన కాడి కి నొక్కుతున్నారు అని అంటుండగా ,శ్రీనివాస్ (అభ్యర్ధి ) నవ్వుతు జనానికి నమస్కారం చెయ్యటం మొదలెట్టాడు ( నాకు ఎక్కడో సింబాలిసం లాగ అని పించింది )

ప్ర.సా మా శ్రీనివాసు " కోట్లు దండుకోవడం కోసం కాదు వచ్చింది . ఈ సులేమాను బిడ్డల బాగు కోసం "అని .

కాకపోతే ఒకటి మాత్రం నిజం ,
ప్ర.స చెప్పిన విషయం ......
" తప్పు చెయ్యటం తప్పు ..... కాని ఆ తప్పు ని చూస్తూ ఉండడం ఇంకా పెద్ద తప్పు .."

"౧౦౦ కో సారా ప్యాకెట్ కోసమో వోట్ వేయ్యోద్దు.... "

వారి ప్రత్యర్ధులు ఇలా అన్నరంట ...." వోటుకు మూడు ఒండలు ఇస్తాం మేము ..... మాకే ఆ వోట్లు పడతాయి ..... ఆలోచించే (మధ్య తరగతి .. .అంతో ఇంతో చదువుకున్నవారు ) వోట్ వెయ్యరు ... ఇక ధనిక వర్గం (చెప్పకర్లేదు అనుకుంటా ) .."

సో మనం ఎప్పటికి ఆలోచిస్తూనే వుంటామ లేక ? మన హక్కు వినియోగించు కుంటామ ?అనేది మనం అలోచిన్చాలిస్నా విషయం , ఏమంటారు ?

కామెంట్‌లు లేవు: