22, మే 2008, గురువారం

ఉట్టి మీద తట్ట - రోట్లో తల



మూడు రోజుల నుండి నా పరిస్తితి ఇలా ఉంది .నేను ఉన్న కొలువు కి జై కొట్టి కొత్తబంగారు లోకం వైపు చుస్తూ పట్ట పగలే కలలు కంటున్నాను .... పంచదార చిలక లాంటి తీపి కబురు కోసం చూస్తూ ఉంటే , చావు కబురు చల్లగా మెయిల్ లో వచ్చింది .... సదరు కొత్త లోకం కంపనీ వాళ్ల నుండి .
"బాబు మీ చూపులు ఆకాశం వైపు ఉన్నై , కాని మీ కాళ్ళు ఇంక నేల మీదే ఉన్నాయి " , " ఇందు మూలం గా చెప్పోచేదేమంటే మీరు కోరిన ది ఇస్తే మా కంపని పుట్టి మునుగును కావున ఇచ్చిందే ,పుచ్చుకోండి "
అని చావు కబురు చల్లగా చెప్పారు కొత్త బ....(ఇంకేమి బంగారం , నా బొంద , పాత రాగి సామానులు కొంటాం ,అనే వాళ్లు ఇప్పుడు :'( )

ఇక ఇటు చుస్తే మా కంపనీ వాళ్ళేమో , అదుగో హైకు , ఇదిగో పని అని , చిన్న పిల్లాడి కి చంద మామ ని చూపుతున్నట్టు మాకు చూపిస్తున్నారు .వచ్చే నెలలో లోనే వచ్చేస్తోంది హైకు అనుకుంటే , మేము ఏమి ఇత్తడి కొంపని కి తక్కువా అని , " ఒమేరికా వాడు నాటిన డాలర్లు సరిగ్గా పండి చావలేదు , కావున మీకు వచ్చే నెల కాదు , ఆ పై నెల లో ఇస్తాము " అని ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చారు .
బెంచి మీద కూర్చున్న ఆసాములకి శంకర గిరి మాన్యాలు కి పంపుతామని బెదరిస్తున్నారు !!

ఇప్పుడు జీడి పప్పులు (క్రీమ్ బిస్కట్ ) ల బదులు సేన్క్కాయలు (కుక్క బిస్కట్ ) లు ఇస్తామన్న వొడి దగ్గరా కేళ్లాల , లేక ఉట్టి మీద ఉన్న ఖాళి తట్ట చూపుతున్న చోటే ఉండాలా , తేల్చుకోలేక తల బద్దలు కొట్టుకుంటున్న !!

ఈ ప్రశ్న కి మీకు సమాధానం తెలిసి చెప్పక పోతే మీ తల వెయ్యి వ్రక్కలు అవుతుంది ( బాగా ఒల్డుగా ఉంది , పోని మూడు నెలలు బెంచి మీద , నెట్టు , కుర్ర్చోడానికి కుర్చీ లేకుండా ఐపోగలరు )

6 కామెంట్‌లు:

ramya చెప్పారు...

:)

కొత్త పాళీ చెప్పారు...

ఈ ఆధునిక బేతాళుడి శాపం బావుంది. సందిగ్ధ పరిస్థితుల్నించి కూడా కామెడీ పిండటం, పండిచటం మంచి స్కిల్.

BHARAT చెప్పారు...

@కొత్తపాళి గారికి ,

చమక్కు ఎంటంటె ఈ టపా రాసిన వెంటనే నేను ఎంతో కాలం నుంచి వైయిట్ చేస్తున్న కాల్ కూడా వచ్చింది ? నా పని పొయ్యి నుంచి పెనం లొకో ఇంకో దేనిలొనొ పడబొతొంది !!

@రమ్య గారు

పై కామెంట్ చూస్తే మళ్లీ నా బాధ అర్ధం అవుతుంది :)

గీతాచార్య చెప్పారు...

అంతా మాయ బ్రదరూ! నీ స్టైలు బాగుంది. నీ కోరిక తీరాలని బేతాలుడికి ఆజ్ఞ.

టా టా.

అజ్ఞాత చెప్పారు...

రెండ్రోజులు హిమాలయాల ట్రిప్పేసి వస్తే అన్ని సమస్యలూ తీరిపోతాయి.:-)

-- విక్రమార్క విహారి

BHARAT చెప్పారు...

@గీతాచార్య గారు తాంకులు

@విహరి గారు ,

ఈ రొజు నుండి నేను తల ఎత్తుకు తిరుగుతా మా ఆఫీసు లో , నా బ్లాగును విహరి చూసారు !!